అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
1. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
2. వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
3. నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||