అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని

అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని

ఎలుగెత్తి చెప్పాలిరా-రాజులకు రాజని(2)

గళమెత్తి పాడాలి రా-మహిమ ఘనత నీకని

లోకాన చాటాలి రా త్వరలో రానున్నాడని

అ:ప  యేసయ్య మాటలో విడుదల ఉన్నది

యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షమమున్నది

యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నదీ

1 మాటమాత్రం సెలవియ్య గా సమాధిలోని లాజరు

బయటికొచ్చెను

చిన్నదానా లెమ్ము అనగా యాయీరు కూతురు తిరిగి లేచెను(2)

2 చల్లనైన చేతి స్పర్శ తో గుడ్ది వాడు చూపు పొందెను

మాట అన్న తక్షణమే పక్ష వాయువు వదిలి పోయెను(2)

3.శక్తీ గల ఆ చూపుతో సేన దయ్యాములు వదిలి పోయెను

 

బెతేస్థా కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థత పరచెను(2)