అందరి హృదయాలను ఎరిగియున్న దేవుడు

అందరి హృదయాలను ఎరిగియున్న దేవుడు

అంతరింద్రియాలను పరీక్షించు నాధుడు

అ.ప. : యేసు ఒక్కడే – యేసు ఒక్కడే

1. పిలవకముందే బదులిచ్చేవాడు

వెదకకముందే ఎదురొచ్చేవాడు

అడగకముందే గ్రహియించేవాడు

తలవకముందే కనిపించేవాడు

2. పగిలిన హృదిని సరిచేసేవాడు

మరణపు విషము విరిచేసేవాడు

చెదిరిన ప్రజను సమకూర్చేవాడు

పలికిన మాట నెరవేర్చేవాడు

3. దీనుల మొరను ఆలించేవాడు

పాపపు చెరను ఛేదించేవాడు

కూలిన బ్రతుకు నిర్మించేవాడు

 

అంతము వరకు ప్రేమించేవాడు