Jesussongs

అపరాధిని యేసయ్యా

అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2) దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2) ద్రోహుండనై జేసితినీ దేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను […]

అపరాధిని యేసయ్యా Read More »

సంతోష వస

  సంతోష వస్త్రం   సంతోషం యేసు వందనం నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై”  పల్లవి: సంతోష వస్త్రం మాకు దరియింప చేశావు-  మా దుఃఖ దినములు సమాప్త పరచావు “2”  సంతోషం యేసు వందనం-నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై  స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం-మా దేవా నీకే అర్పితం   “సంతోష”  1. నిత్య సుఖములు కలవు నీ సనిదిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో “2”  విడువనూ యెడబాయనని వగ్ధానమిచ్చి బలపరచావు “2”   “సంతోషం”  2. రక్షన ఆనందం మాకిచ్చావు మాక్రయ ధనమంత చెల్లించావు “2”  ఏ తెగులూ నీ గుడరమును

సంతోష వస Read More »

సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు

  సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు 1. దోషమెరుగని మనుజకుమారుడు యేసునాధుడు రోషమున్న యెహొవ సుతుడు నా దేవుడు యెహొవ సుతుడు నా దేవుడు 2. పరమువిడిచిన త్యాగమూర్తి యేసునాధుడు కరముచాచిన మధ్యవర్తి నా దేవుడు 3. సత్యమున కాధారభూతుడు యేసునాధుడు నిత్యము నా   స్తుతుల పాత్రుడు నా దేవుడు

సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు Read More »

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

  సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము   యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే            ||సుగుణాల||   యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో         ||సుగుణాల||   యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా Read More »

సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా

Title106. సుక్షేమ శుభకాల విశ్రాంతిదినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా Lyrics 1.సుక్షేమ శుభకాల విశ్రాంతిదినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా ప్రత్ర్యేక దేవా స్తుతిఁ గావింతు మెంతయు 2.నీ యందు సృష్టికర్త విశ్రామ మెుందెను నీ యందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యఁ బడెను 3.భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని పాడి మా యేసు స్తోత్రము పితృపుత్ర

సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా Read More »

సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా

  సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా  సమస్త ప్రాణికోటికి ఆధారుడా – ఆద్యంతమూ నీవయా  నీ ప్రేమకు కొరతలేదయా – నీ జాలికి కొదువలేదయా  (2)  యేసయ్యా -యేసయ్యా-  యేసయ్యా  హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2)  1. నా తల్లి గర్భములో నన్ను రూపించి – నీ స్వరూపములో నన్ను చేసినా  (2)  నిత్యజీవమిచ్చుటకు సిలువలో బలియై- నా పాప ఋణమును తీర్చినదేవా –               యేసయ్యా -యేసయ్యా-  యేసయ్యా  హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2)      “సృష్టికి”  2.మరణశయ్యపై నేను కృంగియుండగా – నీ కరుణ హస్తమే ఆదరించెను  నూతన జీవమిచ్చుటకు మరణము గెలచి- నీ రాజ్యవారసునిగా చేసిన తండ్రి  యేసయ్యా -యేసయ్యా-  యేసయ్యా  హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2)        “సృష్టికి” 

సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా Read More »

సృష్టి పితా – సర్వో న్నతా = సమర్పింతున్ – సర్వస్వమున్

  సృష్టి పితా – సర్వో న్నతా = సమర్పింతున్ – సర్వస్వమున్   1. భూమి ఆకాశము నీవే – భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే – బల శౌర్యములు నీవే   2. మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే = మా దేహముల్ – మా గేహముల్ మా జీవితము నీవే   3. వెల లేని గాలి వెలుతురులు – విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు – నీ కరుణా వర్షములు   4. పరిశుద్ద గ్రంథపు పలుకులు – పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని మాటలు – మా వెల్గు బాటలు 

సృష్టి పితా – సర్వో న్నతా = సమర్పింతున్ – సర్వస్వమున్ Read More »

సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును

  సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును  సర్వ లోక నాధ సకలం నీవేగా  సర్వలోక రాజ సర్వము నీవేగా  సన్నుతింతును అను నిత్యము. . . .   1. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి  కన లేని అంధులకు చుపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి  నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు   2. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి  నీ రాజ్యములో నివసింప కొనిపొవా త్వరలో రానుంటినే  నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు.

సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును Read More »

సృష్టికర్తవైన యెహోవా….నీ చేతి పనియైన నాపై ఎందుకింత

  సృష్టికర్తవైన యెహోవా….నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ   మంటికి రూపమిచ్చినావు….మహిమలో స్ధానమిచ్చినావు….నాలో. . . . నిన్ను చూసావు….నీలో. . . . నన్ను దాచావు….నిస్వార్ధమైన నీ ప్రేమ  మరణము కంటే బలమైనది నీ ప్రేమ                        !!సృష్టికర్తవైన యెహోవా!!    1.ఏ కాంతి లేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి !!2!!యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!!  !!సృష్టికర్తవైన యెహోవా!!    2. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!!యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!!                     !!సృష్టికర్తవైన యెహోవా!! 

సృష్టికర్తవైన యెహోవా….నీ చేతి పనియైన నాపై ఎందుకింత Read More »

సియోనులో స్థిరమైన పునాది నీవు

  సియోనులో స్థిరమైన పునాది నీవు (2)  నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు (2) ||సియోనులో||  1.సూర్యుడు లేని చంద్రుడు లేని-చీకటి రాత్రులు-లేనే లేని (2)  ఆ దివ్యనగరిలో కాంతులను- విరజిమ్మెదవా-నా యేసయ్యా (2)  ||సియోనులో||  2.కడలి లేని కడగండ్లు లేని-కల్లోల స్థితిగతులు-దరికేరాని (2)  సువర్ణవీధులలో-నడిపించెదవా- నా యేసయ్యా (2)  ||సియోనులో||  3.కలతలు లేని కన్నీరు లేని-ఆకలిదప్పులు అసలే లేని (2)  నీ శాశ్వత రాజ్యముకై-సమకూర్చుచున్నావా-నా యేసయ్యా (2) ||సియోనులో||  4.సంఘ ప్రతిరూపము-పరమ యెరూషలేము (2)  సౌందర్య సియోనులో-నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)  నీ తోనే నా నివాసము-నిత్యము ఆనందమే (2)   ||సియోనులో||   

సియోనులో స్థిరమైన పునాది నీవు Read More »