అనుదిన జీవితంలో రోజులు ఎన్నో ఒక్కొక్కరోజు

అనుదిన జీవితంలో రోజులు ఎన్నో ఒక్కొక్కరోజు

మేలు కలుగుతుంది మరొక రోజు అది దూరమవుతుంది

అయితే చీకటిని వెలుగుగా మార్చి నిర్జీవమైన బ్రతుకుకు

జీవం పోసే క్రీస్తే ఒక వ్యక్తిలో జన్మిస్తే అతనికి ప్రతి రోజు మంచి రోజే””

పల్లవి: సుదినం సర్వజనులకు-సమాధానం-సర్వ జగతికి “2″

ప్రభు యేసుని జననమానాడు వికసించెను మదిని నేడు”2″”సుదినం”

1.            చీకటి మరణంబులమయం-ఈ మానవ జీవిత మార్గం ఆ.. ఆ… 2

పరముకు పధమై అరుదించె-వెలుగై యేసుడు ఉదయించె “2″ “సుదినం”

2.            కన్నీటితో నిండిన కనులను-ఇడుములనన్నిటిని తుడువను ఆ.. ఆ… ఆ…. ఆ….. “2″

ఉదయించెను కాంతిగ నాడు-విరజిమ్మెను శాంతిని నేడు “2″ “సుదినం”

3.            వచ్చెను నరుడుగ ఆనాడు-తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ… ఆ…. ఆ….. “2″

 

త్వరలో వచ్చును ఆ ఱేడు-స్థిరపడుమ ఇక ఈనాడు “2″      “సుదినం”