అనురాగ వల్లీ మా ఇంటిజాబిల్లి

అనురాగ వల్లీ మా ఇంటిజాబిల్లి (2)

మధురమైన నీపెళ్ళి మా కంటివెలుగు ఓ తల్లి (2) అనురాగ

1.            అనకువ అనరాగముతో అందరిమన్నన పొందాలి

ఆదర్శగృహినివై నీ ఇంటినే ఆనందగృహముగ తీర్చాలి (2)

ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్శించాలి (2)

నీ అక్కర లన్నితీరాలి | అనురాగ|

2.            కలిమిలేములలొ కృంగక కరములు జోడించి వేడాలి

కరుణామయుని కనికరం కలకాలం నీకుండాలి (2)

కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి  (2)

 

నీ ఇంటి పేరు నిలపాలి         |అనురాగ|