అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే

అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)

నా తల్లియు నీవే నా తండ్రియు నీవే

నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)          ||అందరు నన్ను||

1.            లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2)

నా బంధువు నీవే నా మిత్రుడ నీవే

నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)         ||అందరు నన్ను||

2.            వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2)

నా కొండయు నీవే నా కోటయు నీవే

నా కొండ కోట నీవే యేసయ్యా (2)       ||అందరు నన్ను||

3.            నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2)

నా తోడుయు నీవే నా నీడయు నీవే

 

నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||