అనంత లోకానికారాధ్య దైవమా అదృశ్య మహిమలో అద్యంత రహితుడా
అభిషిక్తుడా అక్షయుడా అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా
అల్ఫా ఒమేగవు నీవు ఆదియు అంతము నీవే ప్రభు 2 “జయ్ జయ్”
1. పాపపు ఊబిలో నే పడియుండగా నా దరికి చేరి నను నీలో దాచావయా 2
శాశ్వత శోభాతిశయముగ నను మార్చి బహు తరములకు నిత్యజీవమిచ్చావే
పరిశుద్ధుడా పావనుడా పరిపూర్ణుడా ప్రసన్నుడా1
ప్రేమాస్వరూపివి నీవు కారుణామయుడవు నీవే ప్రభు 2 “జయ్ జయ్”
2. పరిపూర్ణ సౌందర్య సీయోనులో నను చేర్చుటయే నీ నిత్య సంకల్పమా 2
సుందర లోకంలో నిను నేను చూచెద సువర్ణ వీధులలో నీతోనే నడిచెద
సర్వేశ్వరా సంపూర్ణుడా శ్రీమంతుడా సాత్వికుడా1
సర్వాధికారివి నీవు సర్వాంతర్యామివి నీవే ప్రభు2 “జయ్ జయ్”