అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా

అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా

మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా

కృప ఇది నీ కృప కేవలం నీ కృప

కృపా … కృపా … కృపా …. కృపా ||అనంత||

1.            కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని కొమరునిగా లెక్కించావు

క్షమించే మనస్సు కలిగి ఫలించే జీవమిచ్చి

పరలోక పౌరునిగ నను చేసావు. ||కృపా||

2.            అప్పగించుకున్నాను నీ కృపకే నేను

గొప్ప దేవుడ నీ సన్నిధిలో ఉన్నాను

పిలిచిన వాడా నన్ను గెలచిన వాడా

 

ప్రేమించి ప్రేరేపించి స్థిర పరచిన వాడా. ||కృపా||