అనుదినము ప్రభుని స్తుతియించెదము

అనుదినము ప్రభుని స్తుతియించెదము

అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను

అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2)       ||అనుదినము||

1.            ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది

నా అడుగులనుసుస్థిరపరచి ఉన్నతస్థలముననింపునది(2)      ||అల్లుకుపోయేది||

2.            ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది

 

స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2)       ||అల్లుకుపోయేది||