అనంత లోకానికారాధ్య దైవమా అదృశ్య మహిమలో

అనంత లోకానికారాధ్య దైవమా అదృశ్య మహిమలో అద్యంత రహితుడా

అభిషిక్తుడా అక్షయుడా అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా

అల్ఫా ఒమేగవు నీవు ఆదియు అంతము నీవే ప్రభు 2 “జయ్ జయ్”

1.            పాపపు ఊబిలో నే పడియుండగా నా దరికి చేరి నను నీలో దాచావయా 2

శాశ్వత శోభాతిశయముగ నను మార్చి బహు తరములకు నిత్యజీవమిచ్చావే

పరిశుద్ధుడా పావనుడా పరిపూర్ణుడా ప్రసన్నుడా1

ప్రేమాస్వరూపివి నీవు కారుణామయుడవు నీవే ప్రభు 2 “జయ్ జయ్”

2.            పరిపూర్ణ సౌందర్య సీయోనులో నను చేర్చుటయే నీ నిత్య సంకల్పమా 2

సుందర లోకంలో నిను నేను చూచెద సువర్ణ వీధులలో నీతోనే నడిచెద

సర్వేశ్వరా సంపూర్ణుడా శ్రీమంతుడా సాత్వికుడా1

 

సర్వాధికారివి నీవు సర్వాంతర్యామివి నీవే ప్రభు2 “జయ్ జయ్”