అనంతము నుండి అనంతము వరకు

అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా….

నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు

నివసించు దేవా….

ఈ భూవికి ఎల్లలను నియమించినావు

సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు

నీ మహిమతో నన్ను నింపుము(2)

ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును

నిన్నే (2)

1.భూమ్యాకాశములు సృష్టించినావు

నీ పోలికలో నన్ను నిర్మించినావు (2)

నీ చిత్తమునాలో నేరవేర్చుచుము దేవా

నీ కొరకే జీవింతును (2)

నీ కొరకే జీవింతును

ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును

నిన్నే (2)

2. విశ్వములో నిరతం పాలించువాడా

నీ హస్తముతో నన్ను నడిపించుము(2)

నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా

నా హృదయము అర్పింతును(2)

నా హృదయము అర్పింతును

ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును

 

నిన్నే (2)