అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

పాట – 32

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1.            వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను అనాది

2.            తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను అనాది