అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా

అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2)

పుష్పించలేక ఫలియింపలేక (2)

మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

1.            ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)

కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)

యోచించు ఇది న్యాయమేనా (2)   ||అందాల||

2.            ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)

పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2)    ||అందాల||

3.            ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)

ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)

 

ప్రభు కొరకై ఫలియింపలేవా (2)   ||అందాల||