వర్ణించలేను వివరించలేను

వర్ణించలేను వివరించలేను  అతిశ్రేష్టమైన నీనామమున్ ఏసునీనామమున్  కొనియాడెదన్ కీర్తించెదన్ – 2  అత్యంతమైన నీప్రేమను ఏసునీప్రేమను  1. మహోన్నతుడానీవే పరిశుద్ధుడ నీవే – 2  పాపినని చూడక ప్రేమించితివే – 2   హల్లేలూయా హల్లేలూయా  – 2   అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2  2.  సర్వాధికారి సర్వోన్నతుడా – 2   దీనులైన మమ్ము కరుణించితివే – 2   హల్లేలూయా హల్లేలూయా  – 2   అర్పింతుస్తుతులను (నా)ఆరాధ్యుడా – 2  3. రత్నవర్ణుడవు అతిసుందరుడవు – 2  నీమహిమ నాకిచ్చి వెలిగించితివే – 2   హల్లేలూయా హల్లేలూయా  – 2  

వర్ణించలేను వివరించలేను Read More »

వర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు

  వర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)  యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)    1.పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావుపాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)  ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ॥యేసయ్యా॥    2.అంధకారమైన నాకు వెలుగునిచ్చినావుఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)  ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ॥యేసయ్యా॥    3.తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్నుఆదరించినావు ఓదార్చినావు (2)  ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను        ॥యేసయ్యా॥ 

వర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు Read More »

వందనాలయ్యా- వందనాలయ్యా

  వందనాలయ్యా- వందనాలయ్యా   వందనాలయ్యా- నీకే వందనాలయ్యా   యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా  వందనాలే…..వందనాలే……వందనాలే  1ఇంత వరకు కాచినావు నీకు వందనాలయ్యా  ఎంతో మంచిగా చూపినందుకు వందనాలయ్యా  అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా  నాన్న వలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా  2కట్టుకొనుటకు వస్త్ర ములిచ్చావు వందనాలయ్యా  భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా  ఉండుటకు నివాసము ఇచ్చావు వందనాలయ్యా  అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా(వందనాలయ్యా)  3 వ్యాధి బాధలలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా  హస్తము చూపి స్వస్థపర్చినావు వందనాలయ్యా  పరమవైద్యుడా యేసయ్య వందనాలయ్యా  మా ఆప్త మిత్రుడా యేసయ్య వందనాలయ్యా(వందనాలయ్యా)  4 ఏడ్చినపుడు ఓదార్చి నావు వందనాలయ్యా  కన్నీళ్ళు తుడిచి కౌగలించినావు వందనాలయ్యా  చెయ్యి పట్టి నడుపుచున్నందుకు వందనాలయ్యా  పరమ తండ్రి నా యేసయ్య వందనాలయ్యా(వందనాలయ్యా) 

వందనాలయ్యా- వందనాలయ్యా Read More »

వందనము నీకే – నా వందనము

  వందనము నీకే – నా వందనము  -1  వర్ణనకందని నికే – నా వందనము -2  వందనము నీకే – నా వందనము    1.నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా -2      దాని లోతు ఎత్తు నే గ్రహించి -2 నీ ప్రాణ త్యాగమునే2      2. సర్వ కృపా నిధి నీవే – సర్వాధిపతియును నీవే -2     సంఘానికి శిరస్సు నీవే -2    నా సంగీత సాహిత్యము నీవే -2    3. మృతి వచ్చెనే ఒకని నుండి – కృప వచ్చెనే నీలో నుండి -2      కృషి లేక నీ కృప రక్షించెను -2    కృతజ్ఞతార్పణ లర్పింతును -2 

వందనము నీకే – నా వందనము Read More »

వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు

  వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు !!2!!  నిను ప్రేమించువారికి సమస్తముసమకూర్చి జరిగింతువు. . . .నీయందు భయభక్తి గల వారికీశాశ్వత క్రుపనిచ్చేదవు. . . .!!వేల్పులలో!!  1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలోపవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు !!2!!  మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలోఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో !!2!!!!వేల్పులలో!!  2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములోఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు !!2!!  విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతోనిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో !!2!!                                !!వేల్పులలో!!  3. పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతోఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు !!2!!  పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకుచెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను !!2!!    !!వేల్పులలో !! 

వేల్పులలో బహుఘనుడా యేసయ్యానిను సేవించువారిని ఘనపరతువు Read More »

వేరుచేయజాలునా – దూరపరచజాలునా

  వేరుచేయజాలునా – దూరపరచజాలునా  నన్ను నిన్ను నిన్ను నన్ను  నిత్యము కొరకై పెనవేసుకున్న   ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న   ఈ బంధాన్ని అనుబంధాన్ని  1.శ్రమయైన గాని నిందయైన గాని  హింసయైనా గాని కరువైనా గాని  నీ ప్రేమ నుండి నన్ను వేరుచేయ జాలునా  నీ కృప నుండి నన్ను దూరపరచ జాలునా  నిత్యత్వము కొరకై పెనవేసుకున్న  ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న  ఈ బంధాన్ని అనుబంధాన్ని  2.రోగమైన గాని మరణమైన గాని  ఒంటరితనమే గాని ఓటమైన గాని  నీ ప్రేమ నుండి నన్ను వేరుచేయ జాలునా  నీ కృప నుండి నన్ను దూరపరచ జాలునా  నిత్యత్వము కొరకై పెనవేసుకున్న  ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న  ఈ బంధాన్ని అనుబంధాన్ని 

వేరుచేయజాలునా – దూరపరచజాలునా Read More »

వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము

  వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము… “2”   వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము… “2”   ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి   పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం   పరమతండ్రి చెంత చేరి విందుపాట పాడుదాం     1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు,   తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము…..   దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక,   ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము…   అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే…  “2”     “వెయ్యి”     2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును,   దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే…..   ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును   ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే”ఆ షాలేము”    3.దుఃఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని   నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము…..   చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో   ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము..”ఆ షాలేము” 

వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము Read More »

వేదనతో గుండె రగులుచున్నది ఆదరణే లేక

  వేదనతో  గుండె రగులుచున్నది   ఆదరణే  లేక     కుములుచున్నది బాధల   వలయాన   చిక్కి   – రోదనచే  బహుగా  సొక్కిమనసు మూగగా  మూల్గుచున్నది  అప: న్యాయాధిపతి   యేసయ్యా   -న్యాయము  తీర్చగ  రావయ్యా   1.పగవారిముందు  ఘనమైన  విందు  సిద్ధము  చేసేదనంటివే    పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే  నా పక్షమందు నిలిచి పగతీర్చుము నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము  2.నీ  సేవకులను  ప్రత్యేకించితివే  వారిని  హెచ్చించెదనంటివే    నీ  సేవకులనే   వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే    అవమానమునే  వారికి  కలుగజేయుము        నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము  3.అరచేతియందు  నను   చెక్కుకుంటివే  కీడేమి  రానీయవంటివే       చెరపట్టగా   నన్ను  చెలరేగిన  వారిని  ఆటంకపరచకుంటివే    నమ్మదగిన   దేవా   నను  ఎడబాయకము   విరోధుల చేతిలో నను పడనియ్యకుము 

వేదనతో గుండె రగులుచున్నది ఆదరణే లేక Read More »

వేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావుబలమైన రెక్కల క్రిందనాకు ఆశ్రయమిచ్చావు

  వేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు  లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగామా నా కేడెమా ॥2॥    ఆరాధన ఆరాధననా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన ॥2॥  రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బానమైననూ ॥2॥  రోగము నన్నేమి చేయదు ఎ తెగులు సమీపించదు  ॥2||    వేయి మంది పడిపోయినా పదివేల మంది క్రుంగీపోయినా ॥2||  అపాయము రానేరాదు నా గుడారాన్ని సమీపించదు ॥2||    మార్గములో కాపాడుటకై దుతలను ఏర్పరచావు ॥2||  ఏ రాయి తగలకుండా ఏత్తి నన్ను పట్టుకోందువు ॥2|| 

వేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావుబలమైన రెక్కల క్రిందనాకు ఆశ్రయమిచ్చావు Read More »

వందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు

s  వందనంబొనర్తుమో ప్రభో ప్రభో  వందనంబొనర్తుమో ప్రభో ప్రభో  వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా  వందనంబు లందుకో ప్రభో                  ||వందనం||    ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు  గన్న తండ్రి మించి ఎపుడు గాచియు  ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా  యన్ని రెట్లు స్తోత్రములివిగో                ||వందనం||    ప్రాత వత్సరంపు బాప మంతయు  బ్రీతిని మన్నించి మమ్ము గావుము  నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా  దాత క్రీస్తు నాథ రక్షకా                       ||వందనం||    దేవ మాదు కాలుసేతు లెల్లను  సేవకాలి తనువు దినములన్నియు  నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ  సేవకై యంగీకరించుమా                     ||వందనం||    కోతకొరకు దాసజనము నంపుము  ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము  పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము  ఖ్యాతి నొందు నీతి సూర్యుడా                ||వందనం||    మా సభలను పెద్దజేసి పెంచుము  నీ సువార్త జెప్ప శక్తి నీయుము  మోసపుచ్చు నందకార మంత ద్రోయుము  యేసు కృపన్ గుమ్మరించుము             ||వందనం|| 

వందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు Read More »