మూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా

  మూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా ॥2॥  నీటిబుడగలాంటి జీవితంఏ నాడు సమసిపోవునో ఎరుగం ॥2॥  1.మనిషికి తన మనసే చేరసాలరామమతలు మమకారాలు బంధాలురా ॥2॥  వల్లకాటి వరకేరా భవబంధాలునీ కళ్లానికి చేరవురా అనుబంధాలు ॥2॥  కల్లలైన కళలు మానుకోఎల్లవేళలా ప్రభువని వేడుకో ॥2||     ॥మూడునాళ్ళ॥  2.ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము  అది కనిపించీ మాయమయే రంగులవలయం ॥2॥  గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యంఅది పాపానికి జీతమురా మనిషికి మరణం॥2॥  నిత్యమైన సుఖము వెదకరానిరతము ప్రభుని కోరరా ॥2||    ॥మూడునాళ్ళ॥  3.తప్పిదములు దాచువాడు వర్దిల్లడు  అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ॥2॥  జిగటగల ఊభినుండి పైకి లేపినీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు ॥2॥  తీర్పు తీర్చబడకమునుపేతప్పక ఆ ప్రభుని కోరరా ॥2||        ॥మూడునాళ్ళ| 

మూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా Read More »

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం

  మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం (2)  వందనం వందనం…వందనం నీకే మా వందనం (2)  దేవా॥మూడు దశాబ్దాల॥  1.పాపులమైన మమ్మునువెదకి రక్షించినందుకుఏమియు లేని మాకుఅన్నిటిని నొసగినందుకు (2)        ॥వందనం॥  2.బలవంతులుగా చేసిమూడు బాణాలను ఇచ్చినందుకుమా భోజనపు బల్ల చుట్టుఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2)       ॥వందనం॥  3.మా కష్టాలలో, దుఃఖాలలోమమ్ము కాచిన దేవామా వ్యాధులను, బాధలనుతీర్చిన దేవా (2)         ॥వందనం| 

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం Read More »

ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంధాన్ని

  ముసలమ్మ  ముచ్చట్లు  కట్టిపెట్టి పరిశుద్ధ  గ్రంధాన్ని     చేతబట్టి దీక్షతో  నడుముకట్టి  ఇంటింటి తలుపుతట్టి యేసయ్య   ఊసే చెప్పమ్మా  – ఊరకనే ఉంటే  తప్పమ్మా   1.ఆ ఇంటి  సంగతులన్నీ  ఈ  ఇంటికి మోసేవమ్మా      పొరుగింటి  విషయాలన్నీ  చాటింపు   వేసేవమ్మా     ఇక్కడ మాటలు అక్కడ చెప్పి – మంచిని  చెడుగా  తిప్పి       రెచ్చగొట్టే పనులే మానమ్మా  – చిచ్చుపెట్టబాకే  చిన్నమ్మా   2. కల్పించిన కధలంటే  చెవి కోసుకుంటావమ్మా       చేడుమాటల సభాలంటే నువ్వే  ముందుంటావమ్మా      విన్నదానికి కోసరువేసి – ఉన్నదాన్ని     మార్చేసి  కొండాలు  చెప్పవద్దమ్మా  – జగడాలు   పెట్టకు  పెద్దమ్మా   3. మంచిగ ఉన్నోళ్ళని చుస్తే  కళ్ళెర్ర జేస్తావమ్మా       హెచ్చింపబడుతూ  ఉంటే అపనిందలు వేస్తావమ్మా      వ్యంగపుమాటల కత్తులుదూసి – చల్లగ గుండెను  కోసి       గాయాలు  చేయ్యవోద్దమ్మా  – నోటికి  ఉండాలి  హద్దమ్మా 

ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంధాన్ని Read More »

ముక్తి దిలాయె ఈషు నామ్ -శాంతి దిలాయె ఈషు నామ్

  ముక్తి దిలాయె ఈషు నామ్ -శాంతి దిలాయె ఈషు నామ్   ఈషు దయా క బెహత సాగర్   ఈషు హె ధాత మహన్   ఈషు హె ధాత మహన్  చర్న్ మే తు నే జనమ్ లియ ఈషు   సూలి పె కియ విష్రామ్   సూలి పె కియ విష్రామ్  హమ్ పర్ భి ఈషు క్రీపా కర్ణ   హమ్ హే పాపి నదాన్   హమ్ హే పాపి నదాన్  హమ్ సబ్ కె పాపొ కొ మిట్టానె   ఈషు హువ బలిధాన్   ఈషు హువ బలిధాన్ 

ముక్తి దిలాయె ఈషు నామ్ -శాంతి దిలాయె ఈషు నామ్ Read More »

మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి

  మీరు బహుగా ఫలించినచో  మహిమ కలుగును తండ్రికి  ఈ రీతిగా ఫలించినచో శిస్యులై యుండెదరు  1 నీరు కట్టిన తోట వలె నీటి ఊట వాలే నుండేదరు  క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్మును నడిపించును  బలపరచును మీ యెముకలను అధికముగా ఫలించుడి  2 చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు  ఎండియున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు  మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి  3వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింప చేయు తన శాంతిని   ఐశ్వర్యముతో నింపు మిమ్ము-ముదిమి వరకు మిమ్ము మోయువాడు  మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి  4 పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటి వారు  పొగడెదరు ప్రజల్లెల్లరు  ప్రభుని ఆశ్చర్య కార్యములను  మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడెదరు. 

మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి Read More »

మా హృదయము తెరిచి..నింపుము నీ ఆత్మతోవెలిగించుము మాజీవితంనీకొరకు సాక్షిగా

  మా హృదయము తెరిచి..నింపుము నీ ఆత్మతోవెలిగించుము మాజీవితంనీకొరకు సాక్షిగా !!2!!  1.పరిశుద్ద రుధిరముతో కడుగుము యేసుఈ క్షణమే ఈ దినమే !!2!!  మెల్లని స్వరములతో మాదరి చేరుమయ్యాదర్శనమే ఇచ్చి మాతో మాట్లాడు !!2!!  2.పరిశుద్ద ఆత్మతో అభిషేకించుముఈ క్షణమే ఈ దినమే !!2!!  మెల్లని స్వరములతో మాదరి చేరుమయ్యాదర్శనమే ఇచ్చి మాతో మాట్లాడు !!2!! 

మా హృదయము తెరిచి..నింపుము నీ ఆత్మతోవెలిగించుము మాజీవితంనీకొరకు సాక్షిగా Read More »

మా సర్వాధికారి నీవేనయ్యా- నీ సన్నిధికి వచ్చామయ్యా

  ప: మా సర్వాధికారి నీవేనయ్యా- నీ సన్నిధికి వచ్చామయ్యా   బహు బలహీనులము యేసయ్యా  మమ్ము బలపరచుము యేసయ్యా  యేసయ్యా యేసయ్యా యేసయ్యా  మా ప్రియమైన యేసయ్యా (2) “మా సర్వాధి ”  1.మా స్నేహితుడవు – మా రక్షకుడవు- పరిశుద్దుడవు   మా యేసయ్యా (2)  పరిశుద్ధమైన  నీ నామమునే  స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)   2.నీవే మార్గము-నీవే సత్యము-నీవే జీవము మా యేసయ్యా (2)  జీవపుదాత-శ్రీ యేసునాధా  స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా  (2)  3.విరిగితివయ్యా – నలిగితివయ్యా  కలువరిలోన నా యేసయ్యా (2)  విరిగి నలిగిన హృదయాలతో  స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2) 

మా సర్వాధికారి నీవేనయ్యా- నీ సన్నిధికి వచ్చామయ్యా Read More »

మారు మనసు పొందుమా మనసు మార్చుకో సుమా

  మారు మనసు పొందుమా మనసు మార్చుకో సుమా..(2)  వేష భాష కాదు మార్చుకొనేది  బ్రతుకు మార్చుకొంటు నీకే మంచిది ..(మారు)  1.గొంగళి పురుగు ఎవరు ప్రేమించరూ  అది చిలుకగా మారితే కావాలి కోరెదరూ(2)  మార్పు చెందని మనము ప్రభువు కెందుకూ  పాపాన్ని  విడచిపెట్టి బ్రతకవెందుకూ  నీవు బ్రతకవెందుకు…(మారు)  2.బాహ్యవేషాన్ని దేవుడెపుడు చూడడు  హృదయాన్ని ఆయన చూడకా మానడు(2)  బాహ్యముగా జరిగేది మార్పే కాదు  దాని వలన దేవునికి వచ్చేది లేదు  నిన్ను మెచ్చేదీ లేదు..( మారు) 

మారు మనసు పొందుమా మనసు మార్చుకో సుమా Read More »

మార్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా

  మార్పుచెందవా  నీ బ్రతుకు మార్చుకోవా (2)  అనుకూల సమయం ఇదియేనని ఎరిగి  మారు మనసునూ పొందవా (2)  1.ఎన్నాళ్ళు నీవు జీవించినాగానిఏమున్నది ఈ లోకంలో  ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికితీర్పున్నది పై లోకంలో (2)  తీర్పు దినమునందున ఆయన ముందు   నీవునిలిచే ధైర్యం నీకుందా (2)  నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా॥  2.దిగంబరిగానే వచ్చావు నీవుదిగంబరిగా పోతావు  మన్నైన నీవు మన్నై పోతావుఏదో ఒక దినమందున (2)  నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలునీవెంట రావెన్నడు (2)  నీవెంట రావెన్నడు ॥మార్పుచెందవా॥  3..ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా  ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపేదేవునికే భయపడవయ్యా (2)  దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరునీకంటూ ఏముందిలే (2)  నీకంటూ ఏముందిలే ॥మార్పుచెందవా॥ 

మార్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా Read More »

మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత

  మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత ॥2॥  మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ ॥2॥పంచుకోవాలి పరవారితో            ॥మారిపోవాలి॥  1.మనము వెలగాలి ఒక దివ్య వెలుగై ॥2॥  వెలిగించాలి ఈ జగతినంతా ॥2॥కదలి రావాలి కరుణంత మనలో ॥2॥కరిగిపోవాలి కఠినాత్ములంతా ॥2||        ॥మారిపోవాలి॥  2.మనము బ్రతకాలి విలువైన బ్రతుకు ॥2॥బ్రతికించాలి ప్రభుయేసు బోధ ॥2॥ఆదుకోవాలి నర జాతినంతా ॥2॥అందించాలి ప్రభు వాక్యమెంతో ॥2||       ॥మారిపోవాలి॥  3.మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ ॥2॥మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ ॥2॥వినిపించాలి మన సాక్ష్యమంతా ॥2॥  కదిలించాలి హృదయాలనంతా ॥2||       ॥మారిపోవాలి॥ 

మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత Read More »