ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం

  ప్రియ యేసు నిర్మించితివి  ప్రియమార నా హృదయం  మృదమార వసియించునా  హృదయాంతరంగమున    నీ రక్త ప్రభావమున  నా రోత హృదయంబును ||2||  పవిత్రపరచుము తండ్రి  ప్రతి పాపమును కడిగి ||2||         ||ప్రియ యేసు||    అజాగరూకుడనైతి  నిజాశ్రయమును విడచి  కరుణారసముతో నాకై  కనిపెట్టితివి తండ్రి ||2||               ||ప్రియ యేసు||    వికసించె విశ్వాసంబు  వాక్యంబును చదువగనే ||2||  చేరితి నీదు దారి  కోరి నడిపించుము ||2||             ||ప్రియ యేసు||    ప్రతి చోట నీ సాక్షిగా  ప్రభువా నేనుండునట్లు ||2||  ఆత్మాభిషేకమునిమ్ము  ఆత్మీయ రూపుండా ||2||           ||ప్రియ యేసు|| 

ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం Read More »

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు  నీదు పొలములో కూలివానిగా  కావాలి నేను నీదు తోటకు కావలివానిగా  అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే  అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే  స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను  మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)  మరువకు నా ప్రాణమా  నీ ప్రయాస వ్యర్ధము కాదు (2)     ||ప్రియ యేసు||  ఏక భావము సేవ భారము  యేసు మనసుతో సాగిపోదును (2)  విసుగక విడువక  కష్టించి పని చేసెదన్ (2)          ||ప్రియ యేసు|| 

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో Read More »

ప్రియమైన యేసయ్య -ప్రేమకే రూపమా ప్రియమార నిను చూడని

  ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా  ప్రియమార నిన్ను చూడనీ  ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా  ప్రియమైన నీతో ఉండనీ  నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)  ఆనందము సంతోషము నీవేనయ్యా  ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||    జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ  అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||    ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై  ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||    ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా  పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా|| 

ప్రియమైన యేసయ్య -ప్రేమకే రూపమా ప్రియమార నిను చూడని Read More »

ప్రియతమా బంధమ నా హృదయపు ఆశ్రయ దుర్గమ

  ప్రియతమా బంధమ నా హృదయపు ఆశ్రయ దుర్గమ,   అనుదినం అనుక్షణం నీ వొడిలో    జీవితం ధన్యము,   కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించేదను  1. అందకారపు సమయములోన నీతి సూర్యుడై ఉదయించావు      గమ్యమెరుగని పయనములోన సత్యసముడై నడిపించావు      నా నీరీక్షణ ఆధారం నీవు, నమ్మదగిన దేవుడనీవు      కరుణ చూపి రక్షించినావు కరుణమూర్తి యేసునాద   కోరస్ –   వందనం వందనం దేవా వందనం వందనం,   అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం      కడవరకూ కాయుమయా నీ కృపతో కాయుమయా  2. పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతిoచెధను      పరిశుధుడవు నీవేనని ప్రానార్పనతో ప్రణమిల్లెదను      విశ్వసించినవారందరికి నిత్యజీవము నొసగే దేవా      దీనుడను నీ శరణు వేడితి ధన్యుడను నీ కృపను పొందితి (2) ||వందనం॥ 

ప్రియతమా బంధమ నా హృదయపు ఆశ్రయ దుర్గమ Read More »

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడుమితిలేని

  ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు  మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును  క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్  శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును    నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు  మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను  భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను  క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు    దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు  మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును  భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్  జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును    ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా?  పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు  నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను  కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడుమితిలేని Read More »

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా

  పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)  హల్లెలూయా – హల్లేలూయా (2)    తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)  కడవరి చినుకులు పడగా పొలములో (2)  ఫలియించెను దీవెనలే ||పావురమా||    అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)  సభకే జయమౌ ఉబికే జీవం (2)  ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా||    బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)  వెలిగే వరమా ఓ పావురమా (2)  దిగిరా దిగిరా త్వరగా   ||పావురమా|| 

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా Read More »

పావురమా నీప్రేమ ఎంత మధురమూ

  పావురమా నీప్రేమ ఎంత మధురమూ  పావురమా నీమనసు ఎంత నిర్మలమూ  జుంటేతెనే ధారకన్నా మంచిగోధుమ పంటకన్న  ప్రేమ మధురము నీమనసు నిర్మలము  అ!పనాయేసయ్యా నీప్రేమఎంత మధురమూ  నాయేసయ్యా నీమనసు ఎంత నిర్మలమూ  1.కోండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను  ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను !!2!!  ఎటుచూసినను ఏం చేసినను మదిలో నిన్నే తలచుచున్నాను !2!  ఒకసారి కనిపించి నీదారి చూపించావా !!2!!  నాయేసయ్యా నీప్రేమ ఎంత మధురమూ  నాయేసయ్యా నీమనసు ఎంత నిర్మలమూ  2.దవళవర్ణుడు రత్నవర్ణుడు నాప్రాణప్రియుడు   పదివేలమందీ పురుషుల్లోన పోల్చదగినవాడు !!2!!  నావాడు నాప్రియుడు మదిలోనిన్నే తలంచుచున్నాను !!2!!  ఒకసారి కనిపించి నీదారి చూపించవా !!2!!(పావురమా…) 

పావురమా నీప్రేమ ఎంత మధురమూ Read More »

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా  నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)  యేసయ్యా కావాలయ్యా  నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||    ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి  నేను ప్రార్థింపగ దయచేయుమా (2)  ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)  నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||    సింహాల గుహలోని దానియేలు శక్తి  ఈ లోకంలో నాకు కావలయ్యా (2)  నీతో నడిచే వరమీయుమా (2)  నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||    పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి  నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)  చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)  ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన || 

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా Read More »

ప్రార్ధన వినువాడా నా కన్నీరు చుచువాడా

  ప్రార్ధన వినువాడా నా కన్నీరు చుచువాడా  స్వస్థత నొసఁగువాడా స్తోత్రము యేసయ్య  1. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలనూ అయ్యా  2.మదికరిగి చెయ్యిచాపి – మహిమలు చేయువాడ – అయ్యా  3.నా చిత్తమే శుద్ధిపడుమని స్వస్థత నొసఁగితివా – అయ్యా  4.వ్యాధులన్ని మోసి – సిలువలో సులువుగా మాన్పేవయ్యా – అయ్యా 

ప్రార్ధన వినువాడా నా కన్నీరు చుచువాడా Read More »

ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు

ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు  1. విశ్వసించిన క్రైస్తవులంతా ఏకమై స్థిర ఆస్తులు అమ్మిఅక్కర కొలది పంచి పెట్టిరి మొదటి శతాబ్ధపు క్రైస్తవులంతా  2. స్వస్థతలంటు వరాలు అంటుపండుగలంటు పబ్బం గడుపుతు – క్రీస్తునుఅవహేళన చేస్తుసాతను భోధకకులుగా మారిపోయిరి  3.ఏకమై ఉన్న క్రైస్తవులలో క్రీస్తు విరోధి బయలు దేరెనుయేసుకు జయ్ జయ్ అంటు రాళ్ళ వర్షము రప్పిస్తున్నాడువిరోధ భావము రగిలిస్తున్నాడు  4. బోధించే బోదకులెందరో బయలు దేరిరి బోధించె సంస్ధలెన్నోనిర్మించిరియేసు చెప్పిన బోధను మార్చకు ప్రపంచక్రైస్తవ డినామినేషన్  5. తరతరాలుగ నశించిపోయె క్రైస్తవులారా యేసు వాక్యముప్రజలకు చెప్పుచులోకరక్షణకు పాటుపడండి ఎల్లవేళలా 

ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు Read More »