నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను

  నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ..  ఆనందముతో హర్షించి పాడెదన్జీవించు కాలమంతయు – హల్లేలూయ….    1. అంధకార పాపమంత – నన్ను    చుట్టగాదేవుడే నా వెలుగై – ఆధరించెను    2. దొంగ ఊబి నుండి – నన్ను    లేవనెత్తెనురక్తముతో నన్ను కడిగి – శుద్ది చేసెను    3. నాకు తల్లిదండ్రి మరియు – మిత్రుడాయెనేనిందలోర్చి   ఆయనను – ప్రకటింతును    4. వ్యాది భాధ లందు నేను – మొర్ర పెట్టగా   ఆలకించి బాధ నుండి నన్ను – రక్షించెను    5. భువి లోని భాదలు – నన్నేమి చేయును   పరలోక దీవెనకై – వేచి యున్నాను 

నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను Read More »

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా

  నా నీతి నీవే నా ఖ్యాతి నీవే  నా దైవమా యేసయ్యా  నా క్రియలు కాదు నీ కృపయే దేవా  నా ప్రాణమా యేసయ్యా  నదులంత తైలం విస్తార బలులు  నీకిచ్చినా చాలవయ్యా  నీ జీవితాన్నే నాకిచ్చినావు  నీకే నా జీవమయ్యా  హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4)       ||నా నీతి||    నా దీన స్థితిని గమనించి నీవు  దాసునిగ వచ్చావుగా  నా దోష శిక్ష భరియించి నీవు  నను నీలో దాచావుగా  ఏమంత ప్రేమ నా మీద నీకు  నీ ప్రాణమిచ్చావుగా  నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను  యజమానుడవు నీవేగా ||హల్లెలూయ||    నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు  నీవు చేరదీసావుగా  నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి  కన్నీరు తుడిచావుగా  నేనున్న నీకు భయమేలనంటూ  ఓదార్పునిచ్చావుగా 

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా Read More »

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు

  నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)  అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)  పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్        ||నా నాథుడా||    దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)  యావత్తు పెంటయనుచు (2) నిదిగో         ||నా నాథుడా||    ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)  ఆశ కల్గించు నాలోన (2) నీవే             ||నా నాథుడా||    పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)  కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు        ||నా నాథుడా||    భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)  పాతకుడ నేనైతిని (2) మహా          ||నా నాథుడా||    ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)  సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు        ||నా నాథుడా||    హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)  ఉల్లమందానంద ధ్వని (2) యిదియే       ||నా నాథుడా|| 

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు Read More »

నాధుడేసు తన్ను వెంబడించగా

  నాధుడేసు తన్ను వెంబడించగా  పిలుచుకున్న ప్రియశిష్యుడా  సర్వమును వీడి యేసుతోడను  ముందుముందుకే సాగుమా    అ.ప. : సాగుమా యేసుతో – ముందుకే సాగుమా  1. నాగిటిపై చేయివేసి ఎన్నడూ – వెనుక తిరిగి చూడబోనని  శ్రమలు బాధాహింసలెన్ని కలిగినా – యేసునెపుడు వీడిపోనని  ముందాునున్న వాటి వైపు చూడుమా  వెనుకతట్టు చూడకుండ సాగుమా    2. ఎన్నికైనవెన్నెన్ని యున్నను యేసుకన్న మిన్నకాదాని  ఏది ఉన్నను లేకున్నను యేసు ఉన్న నాకు చాలని  ఉన్నతమగు యేసువార్త చాటుమా  సన్నుతించుచునెపుడు సాగుమా 

నాధుడేసు తన్ను వెంబడించగా Read More »

నాదేవునీ గుడారములో నా యేసునీ నివాసములో

  నాదేవునీ గుడారములో నా యేసునీ నివాసములో (2)  ఎంతో సంతోషం ఎంతో ఆనందం   నా యేసునీ నివాసములో (2)                (నాదేవుని)   1.సీయోను మార్గము నందూ సహాయకుడవు నీవేకదా   రాత్రి జాముల యందు నా తోడు నీడవు నీవేకదా  (2)  నా కొండ నీవెగ నా కోట నీవెగ  (2)  నా యేసు రక్షక నీవే కదా  (2)               (నాదేవుని)   2.నా యేసు సన్నిది యందూ నేను పరవశ మోందెదను  నా యేసు స్వరమును వినుచూ నేను కాలము మరచెదను (2)  నా గానమాయనే నా ధ్యానమాయనే (2)  నాదు స్వరము నా ప్రభువే  (2)            (నాదేవుని)  3.ఆనంద తైలము నందూ నన్నుఅభిషేకించెనుగా  నాదు వస్త్రములందూ అగరు వాసన నింపెనుగా (2)  నా ప్రాణ నాదుడా నా ప్రేమ పాత్రుడా  (2)  నా యేసునాదుడ  నీవేకదా  (2)

నాదేవునీ గుడారములో నా యేసునీ నివాసములో Read More »

నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో

  నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో  తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును  కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును  1.కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా  నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||  2.జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే  నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||

నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో Read More »

నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!!

  నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!!  ఆదరణ నీవని  ఆదరించెదవని !!2!!  నీసన్నీధి చేరితిన్  1పాపమనే ఊబిలో పడియున్నాను పైకి లేపుమా   కరుణ చూపుమా !!2!!  శత్రువుల చేతిలో చిక్కుకుంటిని ప్రభు  !!2!!  కృపచూపి కరుణించవా !!నాదేవా!!  2 ఓటమినే జీవనంగా గడుపుచున్నాను సేదతీర్చుమాశాంతినీయుమా  !!2!!  ఓదార్పు నీవనిగెలుపు నీ సెలవనీ !!2!!  నీప్రేమనే కోరితి.. !!నాదేవా!! 

నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!! Read More »

నాదు జీవితము మారిపొయినది

  నాదు జీవితము మారిపొయినది  నిన్నాశ్రయించిన వేళ  నన్నాదుకుంటివి ప్రభువా          ||నాదు||    చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)  పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా  నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||    కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)  నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా  నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు||    లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)  ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా  నిన్నాశ్రయించితి ప్రభువా..        ||నాదు||    జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2)  చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా  నే పాపినయ్యా ప్రభువా..         ||నాదు||    ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2)  ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి  నన్నెంతగా ప్రేమించితివి..         ||నాదు|| 

నాదు జీవితము మారిపొయినది Read More »