ఓ దేవా దయచుపుమయ్యా

ఓ దేవా దయచుపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొఱ్ఱను ఆలకించుమా నీ కృపతో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు 1. సర్వలోక రక్షకా కరుణించుమయ్యా నీ వాక్య శక్తీని కనుపరుచుమయ్యా అందకార ప్రజలను వెలిగించుమయ్యా పునరుత్తాన శక్తితో విడిపించుమయ్యా   ఒక్కసారి చూడు ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి పరిశుద్దపరచు దేశాన్ని క్షమించు ప్రేమతో రక్షించు (ఓ దేవా)                       [ప్రార్థన] నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము […]

ఓ దేవా దయచుపుమయ్యా Read More »

ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా

ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా -2 నా నీడవై – నను వీడక – నడిపించు నా దేవా – 2 1.. దుప్పి నీటి – వాగుల కొరకు – ఆశపడునట్లుగా దేవా నీకొరకు – నా ప్రాణం – ఆశ పడుచున్నది = 2 నిత్యము నీ వాక్యమందు నిలిపి – నీ కృపలో నను గావుమా – 2 2.. క్రమములేని నా బ్రతుకంతా – శ్రమలపాలైపోగా

ఓ దేవా నా యాత్రలోన – నా తోడు నీవేనయా Read More »

ఓ దివ్యకాంతి,మబ్బు కమ్మఁగా

1.ఓ దివ్యకాంతి,మబ్బు కమ్మఁగా నన్నడ్పుము నా యింటి త్రోవ దప్పిపోతిని నన్నడ్పుము నా కాళ్ళు జారకుండఁ గాచుచు ఒక్కోక్క మెట్టు భద్ర పర్చుమా 2.ఇన్నాళ్ళు నేను కోరకుంటిని నీ శరణు స్వబుద్ది నమ్మి తప్పిపోతిని సదా నన్నడ్పుము గర్వము యేలే నా హృదయము మన్నించు నా గత జీవితము 3.ఇన్నాళ్ళుఁ గాచియుంట వింతను నన్నడ్పుము నా నష్ట కష్ట దుఃఖ బాధలు పోఁగొట్టుము నీ వల్ల నేను జయ మెుందుచు   నిన్ను స్తుతించి పాడుదున్ సదా

ఓ దివ్యకాంతి,మబ్బు కమ్మఁగా Read More »

ఓదార్పు లేదయ్య నాకు ఓదార్పు దయచేయుము

ఓదార్పు లేదయ్య నాకు ఓదార్పు దయచేయుము కడవరి దినాలలో చిక్కుకున్నాను వేదనలో ఉన్న నన్ను లేవనెత్తుము ఘోరమైన పాపినయ్య నేను ఘోరంగా చిక్కుకున్నాను 1.. తండ్రిగా లోకంలో నాకు ఎవరూ లేరు నీవే తండ్రివై లాలించుమయ్య ఆదరించుము నా దేవా అనాదిగా నను విడువాకయ్య 2.. దుఖ సాగరంలో ఈ లోకము నిరాశ గడియలో మా దేశము కొట్టు మిట్టాడు చుందయ్యా   మా యెడల కృప చూపుమయ్య

ఓదార్పు లేదయ్య నాకు ఓదార్పు దయచేయుము Read More »

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్ననుప్రేమించు

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్ననుప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు – ప్రేయసికన్న ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2)   1.. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ (2) ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2) తల్లియైన మరచున నిను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ  

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్ననుప్రేమించు Read More »

ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా

ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా కదలిరావోయ్ – నీవు కదలిరా  జాలరి మనుష్యుల పట్టు జాలరీ … ఆత్మల కాయు కాపరీ  అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 1.. సిలువే నీ స్థావరము – శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము – సాక్ష్యమే నీ సైన్యము 2.. త్యాగమే నీ క్షేమము – ప్రార్థనే నీ యవ్వనము వాక్యమే నీ బాణము – విశ్వాసమే ఉద్యమము 3..

ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా Read More »

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము

ఓ హల్లెలూయ  ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము   1.. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము ప్రత్యేయకపరచి కృపచేత నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము(ఓ)   2.. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రీ స్తోత్రము   ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ  పిలచిన తండ్రీ స్తోత్రము (ఓ)

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము Read More »

ఓ సోదారా అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి

ఓ సోదారా అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి మేలు దొరికె నేడు చూసుకో – నీ జీవితం పండించుకో 1.. తల్లిదండ్రుల విడచి తన ఇంటిని మరచి నీతోనే లోకమై జీవించగా కలకాలం ఈ ధరలో నీతో నడువ నీ ముందర నిలిచే సతి చేయి అందుకో ఓ సోదారీ అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి వెలుగుతో నిన్ను నింపుకో – నీ జీవితం పండించుకో 2.. పుట్టినింటి ఘనత తరతరములు నిలువ నీ

ఓ సోదారా అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి Read More »

ఓ సోదరా యేసుప్రభు రాకడ

ఓ సోదరా యేసుప్రభు రాకడ   సమమీపమౌచున్నదిఅంతము   దగ్గరౌచున్నది   -దేవుని   తీర్పు  రానున్నది 1.. మరణం ఏక్షణం ఎరగం ఎవ్వరం నీదు పాపము  వీడుము  –  క్రీస్తుయేసుని  చేరుము ఈ దినమే సుదినము – జాగేల ఈవేళ 2.. సమయం లేదులే  తరుణం రాదులే నీదు పాపము వీడుము క్రీస్తు యేసుని చేరుము ఈదినమే     సుదినము-జాగేల ఈవేళ

ఓ సోదరా యేసుప్రభు రాకడ Read More »

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో   సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము   ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు Read More »