సృష్టి పితా – సర్వో న్నతా = సమర్పింతున్ – సర్వస్వమున్
1. భూమి ఆకాశము నీవే – భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే – బల శౌర్యములు నీవే
2. మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే = మా దేహముల్ – మా గేహముల్ మా జీవితము నీవే
3. వెల లేని గాలి వెలుతురులు – విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు – నీ కరుణా వర్షములు
4. పరిశుద్ద గ్రంథపు పలుకులు – పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని మాటలు – మా వెల్గు బాటలు