సియోనులో స్థిరమైన పునాది నీవు (2)
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు (2) ||సియోనులో||
1.సూర్యుడు లేని చంద్రుడు లేని-చీకటి రాత్రులు-లేనే లేని (2)
ఆ దివ్యనగరిలో కాంతులను- విరజిమ్మెదవా-నా యేసయ్యా (2)
||సియోనులో||
2.కడలి లేని కడగండ్లు లేని-కల్లోల స్థితిగతులు-దరికేరాని (2)
సువర్ణవీధులలో-నడిపించెదవా– నా యేసయ్యా (2) ||సియోనులో||
3.కలతలు లేని కన్నీరు లేని-ఆకలిదప్పులు అసలే లేని (2)
నీ శాశ్వత రాజ్యముకై-సమకూర్చుచున్నావా-నా యేసయ్యా (2) ||సియోనులో||
4.సంఘ ప్రతిరూపము-పరమ యెరూషలేము (2)
సౌందర్య సియోనులో-నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీ తోనే నా నివాసము-నిత్యము ఆనందమే (2) ||సియోనులో||