ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
మృదమార వసియించునా
హృదయాంతరంగమున
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును ||2||
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి ||2|| ||ప్రియ యేసు||
అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి ||2|| ||ప్రియ యేసు||
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే ||2||
చేరితి నీదు దారి
కోరి నడిపించుము ||2|| ||ప్రియ యేసు||
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు ||2||
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా ||2|| ||ప్రియ యేసు||