ప్రార్థన ప్రియ ఆరాధన-విరిగిన మనసుతో ఆరాధనా
వంగిన మోకాళ్ళతో శ్రీ యేసు ప్రార్థన(2)
1.ఆత్మ కొరకు మేడ గదిలో శిష్యులు చేసిన ప్రార్థన
దీవెన కొరకు యాకోబు చేసిన బలమైన ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన నా ప్రియ ఆరాధన
ప్రార్ధన ప్రార్ధన కన్నీటి ప్రార్ధన. || ప్రార్ధన||
2.షద్రకు మేషకు అబేద్నగోలు అగ్నిలో చేసిన ప్రార్ధన
వర్షం కొరకు ఏలియా చేసిన బలమైన ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మీయ ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన కన్నీటి ప్రార్ధన
3.రక్షణ కొరకు రెండవ దొంగ సిలువలో చేసిన ప్రార్ధన
దేశ క్షేమము కొరకు అందరు కలిసి చేయాలి ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మీయ ఆరాధన
ప్రార్ధన ప్రార్ధన కన్నీటి ప్రార్ధన. ||ప్రార్ధన||