పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి దిగివచ్చిన యేసూ
పరిమళించె నీ రాకతో ఈ భువి – పరమపితా వందనమిదిగో
1. సర్వసృష్టిని తిలకించగను – సూర్యచంద్రులను పరికించగను
నరుడనైన నా యెడల నీవు కృప చూపుటకు ఎంతటి వాడను
2. బీదాలను ఆదరించగను – గ్రుడ్డివారికి చూపునివ్వగను
మానవ రూపము దాల్చినదేవా – మహికి రక్షణ తెచ్చితివయ్యా
3. ధరణిలోని ప్రేమలన్నియును -స్వార్థముతోనే నిండియుండును
ఏ మంచిలేని నాకొరకై ఇలకు దీనుడవై దిగిన నీ ప్రేమ శాశ్వతం