పదే పదే నేను పాడుకోనా-ప్రతిచోట నీ మాట నా పాటగా
మరీ మరీ నేను చాటుకోనా-మనసంత పులకించ నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే-చితికిన నా గుండెకు రాగం నీవే….”2″”పదే”
అ.ప.: మమతల మహరాజ యేసురాజా మమతల మహరాజ యేసురాజా “2″
1. అడగకముందే అక్కరలెరిగి-అవసరాలు తీర్చినా ఆత్మీయుడా-
ఎందరు ఉన్నా బంధువు నీవే-బంధాలను పెంచినా భాగ్యవంతుడా “2”
అవసరాలు తీర్చినా ఆత్మీయుడా-బంధాలను పెంచినా భాగ్యవంతుడా “2””మమతల”
2. అలిగిన వేళ అక్కున చేరి-అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి-నమ్మకాన్ని పంచిన నాన్నావు నీవే
అనురాగం పంచిన అమ్మవు నీవే-నమ్మకాన్ని పంచిన నాన్నవు నీవే “2″ “పదే”