పాడుకుంటూ సాగని నా యాత్రలో నీ గీతం
నవ్వుకుంటూ దాటని ఎదురయ్యే అవరోధం
అలయక విసుగక పరుగును ఆపక
కర్తయేసు నిన్ను చూస్తూ కదలనీ
1.ఎండకు కాలి అరణ్యం ఇబ్బందిని కలిగించినా
నిందకు చీలిన హృదయం ఆపశృతులే పలికించినా
వెనుతిరిగి చూడకుండ-వెనకడుగు వేయకుండ
ప్రార్థనే తోడుగా గమ్యమే చేరని
2. గాలితుఫానుల ప్రళయం భయపెట్టాలని చూసినా
ఓటమిచాయల గరళం స్వరగతులే మార్చేసినా
3. ఉరికే నదుల ప్రవాహం మార్గం మూసివేసినా
ఉరిమే శ్రమల ప్రభావం మాధుర్యం మింగేసినా