పరదేసి పుణ్య క్షేత్ర
యాత్ర బోవుచుందువా
యేసు నాజ్ఞ తలపోసి
మోక్ష మొందఁ బోదును
కొండ లెక్కి యేళ్ళు దాటి
మోక్ష రాజ్యం చేరుదాక
ముందు పోవుచుందును
2 ఒంటిగాను బోవుదువే
నీకు భయ ముండదా
లేదు నాకు భయమేల
స్వామి నన్ను గాచును
మోక్ష రాజ్యం చేరుదాక
యేసు నాకు దోవ చూప
ముందు పోవుచుందును
3పరదేసి మోక్షమందు
నీకు లాభ ముండునా
నిత్యానంద సువిశ్రాంతి
యందు నుండు లాభము
జీవనది నీళ్లు త్రాగి
యేసుతో సదా వసింప
ముందు పోవుచుందును
4 పరదేసి నీతో నేను
యాత్ర చేయవచ్చునా
రమ్ము నాతో గూడా రమ్ము
యేసు నిన్ను రమ్మనెన్
మార్గ యాసమైన నేమి
మాకు మోక్షం చిక్కు వేళ
సువిశ్రాంతి కల్గును