ప్రయాసతో పరుగులెత్తినా – పొందాలని ఆశించినా
కరుణించు దేవా నీ కృపచేతనే
కార్యాలు నెరవేరును – కోరికలన్నీ తీరును
1. కన్నిటితో నీకు మొరపెట్టినా
ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా
ప్రార్థన వినుదేవా నీ కృపచేతనే
మనవులు సన్నిధిని చేరును – త్వరగా జవాబు దొరుకును
2. కుడి ప్రక్కను పదివేలమంది కూలినా
హతమార్చను శత్రువులు చుట్టు చేరినా
రక్షించు దేవా నీకృపచేతనే
అపాయములు తొలగిపోవును-క్షేమము నెమ్మదియు కలుగును
3. తెలివితేటలెన్నో ఉపయోగించినా
బలశౌర్యములన్నీ ప్రయోగించినా
దీవించు దేవా నీ కృపచేతనే
చేతిపనుల ఫలితముండును – ధాన్యముతో కొట్లు నిండును