ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్న నేను
ఉన్నత పిలుపునకు బహుమానం పొందవలెనని
1. ఏవేవి లాభకరమై ఉండెనో-వాటిని క్రీస్తు నిమిత్తం
నష్టముగా నెంచుకొని-ముందుకే సాగుచున్నాను||ప్రభువా||
2. క్రీస్తును సంపాదించుకొని -తన పునరుత్ధాన బలమును
ఎరిగి ఆయన శ్రమలలో-పాలివాడనగుదున్||ప్రభువా||
3. క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్ఠమైన -జ్ఞానం నిమిత్తం
సమస్తమును నష్టముగా -ఎంచుకొనుచున్నాను||ప్రభువా||
4. వెనుక నున్నవి మరచి –ముందున్న వాటి కొరకై
వేగిర పడుచు ధైర్యముగా –ముందుకే సాగుచున్నాను||ప్రభువా||