ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను
1.అపరాధములచే ప్రజలందరును – దేవుని మహిమను కోల్పోయిరి
తన మహిమను మనకిచ్చుటకు – యేసుప్రభువే బలియాయెను
2.కృపాసత్యములు సంపూర్ణముగా – మన మధ్యలో వసించెను
తండ్రి మహిమను తన సుతునిలో – మన మందరము చూచితిమి
3.ప్రభువు ఇంటిని నిర్మించుచుండె – సజీవమైన రాళ్ళతో
ఆయన మహిమ దాని యందుండ – తన సంకల్పమైయున్నది
4.శాంతిరాజు ఇల్లుకట్టుచున్నాడు – మానవ హస్తము అందుండదు
క్రయమునిచ్చి స్థలము కొనెను – తాను కోరిన స్థలమదే
5.ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి – తన పునాదిని వేసెను
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా – ప్రభువే సర్వము చేసెను
6.సింహాసనముపై కూర్చున్న ప్రభువే – అణగద్రొక్కెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భాటముతో – వెలిగించెను తన ఇంటిని
7.దేవుని ఇల్లు ముగించబడగా – పైనుండి అగ్ని దిగివచ్చెను
దహించబడును సర్వమలినము -ఇంటిని మహిమతో నింపును