ప్రభుయేసు నుండి వేరుకాలేను ప్రియులు నన్ను విడిచినా-నా హితులు నన్ను మరచినా
ఈలోకమే నన్ను ద్వేషించినా –
నా శరీరము కుళ్ళినా
1. నా విమెాచకుడు సజీవుడు నన్ను ఎన్నడు మరువడు
నేను భ్రమ పడను,నేను భయపడను
అంత్యదిన మందాయనను-నా కన్నులారా చూతును
నా విశ్వాసమును కాపాడుకొందును
2.నేను నమ్మిన నా యేసు మాట తప్పడు ఎన్నడు
వాగ్దానము చేసి నెరవేర్చు దేవుడు
నిరీక్షణ వాగ్ధాన దేశమునందు ప్రభుతో ఉందును
తుదివరకు నా బ్రతుకున ప్రభువునే ధ్యానింతును