ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా
1 ప్రభు తలను చూడు-ముఖమును చూడు రూపము పోయేగా
నీ కొరకై రూపమును కోల్పోయేను –యేసు ప్రభు
2 ప్రభు చేతులు చూడు -కాల్‌లను చూడు సీలలు కొట్టిరి
ప్రభు రక్తము అంతయును-నీ కొరకై కార్చెనుగా
3 నీవు ఘోర పాపియైన నిన్ను ప్రేమించుచుండెను
ప్రభు ప్రాణము నీ కొరకై –సిలువపై అర్పించెను
4 నీవు పాపం లొనే– ఎంత కాలం జీవించుచుందువు
నీ పాపములన్నియు-మరణమునకు నడుపునుగా
5 ప్రభు పిలుపును వినుము-నేడే రమ్ము యేసుని యొద్దకు
నీ పాపములొప్పుకో -ప్రభు నిన్ను క్షమించును