ప్రభు యేసుని నేడే స్వీకరించు- నీ హృదయంలో అంగీకరించు – 2
నీ హృదయపు భారము తొలగించు (2)
నీ మదిలో నెమ్మది కలిగించు (2) “ప్రభు”
1 ఈ తరుణము విడువక త్వరపడుము
ఈ కరుణను వదలక రారమ్ము (2)
ఆరిక్తుడై నిను రక్షించుటకై (2)
తన రక్తము కార్చెను వీక్షించు (2) “ప్రభు”
2 నీ వెంతటి పాపములో నున్న
నీ అంతము నరకముగా నున్న (2)
ప్రభు చెంతకు చేరుము ఈరోజే (2)
నిను వింతగా మార్చును రారాజు (2) “ప్రభు”
3 నీ పాపము బాపగ ప్రభు వచ్చెను
నీ శాపముతీర్చగ బలియయ్యెను (2)
విలువైన ఆపిలుపును త్రోయుటచే (2)
కలుషాత్ముడ నరకము నీదగును (2) “ప్రభు”