పొర్లి పొర్లి పారుతోంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది “4”
1 నిండియున్న పాపమంత కడిగివేయును “3”
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును “2”
చేయును శుద్ధి (4)
2 రక్తము చిందించకుండా పాపము పోదు “3”
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు “2”
గలదు జీవము (4)
3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే “3”
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము “2”
రక్తము యేసు (4)
4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము “3”
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము “2”
మోక్షం ఉచితం (4)