ప్రేమ సందేశం ప్రభు ప్రేమ సందేశం
చితికిన బ్రతులను కృంగిన హృదయాలను
రక్షణ లేని సర్వజనులకు
ఎండమావులలో నీటిని వెదికే నేస్తమా నీకు తెలుసా
ప్రభు యేసే జీవజలమని
ఎండిన హృదయాలను చిగురింప జేసి
ప్రేమను నింపే దేవుడు నా ప్రభు యేసు క్రీస్తేనని
ఆశ గొన్న ప్రాణమును తృప్తి పరిచే దేవుడని
నీదు చింతలను తీర్చి నీకు శాంతి నొసగునని తెలుసుకో నేస్తమా
2 కనిపించే ఈ లోకాన్ని చూసి మోసపోకుమా నేస్తం
చేయకు లోకంతో స్నేహం-సూర్యుని కింద
నీ ప్రయాస అంత వ్యర్థమై నేస్తం -ప్రభు యేసే నీదు గమ్యం
సర్వ సంపదలు కల్గి ఉండి ప్రాణాలు కోల్పోతే
దేవుని ఉగ్రత నీ మీద కొస్తుందని తెలుసుకో నేస్తమా