ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ ఎన్నడు మారనిది
ప్రేమా ప్రేమా క్రీస్తుని ప్రేమ ఎల్లలు లేనిది
ఉప్పొంగొనది మత్సరపడనిది డంబములేనిది శ్రమలను ఓర్చునది
1.యోగ్యతలేని నను వెదకినది యేసుని ప్రేమ
రక్షణలేని నను రక్షించినది యేసుని ప్రేమ
మరణించే నను బ్రతికించినది యేసుని ప్రేమ
వ్యాధులలో భాధలలో వేదనలో ఆనందములో
విడువక ఎడబాయక తోడుగా ఉండిన ప్రేమ
2. సిలువను మోస్తూ నను క్షమించినది యేసుని
రక్తము కార్చి వెలవెల్లించినది యేసుని ప్రేమ
పాపపునుండి నను లేపినది యేసుని ప్రేమ
వ్యాధులలో భాధలలో వేదనలో ఆనందములో
విడువక ఎడబాయక తోడుగా ఉండిన ప్రేమ “ప్రేమ”