పూజించెదను పూజ్యనీయుడా
నిజదైవమా రవితేజమా
1. వెండి బంగారములు కోరలేదు నీవు
నలిగిన మనస్సే అడిగినావు
విలువైన వాసములు ఆశింపక నీవు
నా హృదిలో ఉండగోరినావు
2. ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక
నా చెంతకే వచ్చినావు
నదులలో మునిగి శుద్దికమ్మనక
నాలో జీవనదులుంచినావు
3. దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక
క్షమియించి రక్షించినావు
ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక
నాతో నుండే దేవుడవు నీవు