పిలచుచున్నాడు ప్రియమైన యేసు
పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా
ప్రేమించినాడు నీ జీవితమును
ఏ భేదము లేక వేగమే రారండి
నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు
నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు||
1.వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు
మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు
రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును
మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి
ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు||
2.మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు
యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి
రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ – యేసు నీ యింటికి
వచ్చినేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||