పట పటమని పై కెగిరే సీతాకోకచిలుక – ఓ సీతాకోకచిలుక
నీ రెక్కల్లో రంగులెన్నో చూడు – ఆ రంగులన్నీ నీకు పూసిందెవారు?(2)
1.మొదట నేను గ్రుడ్డులాగ వుంటిని – పురుగువలె ఆకులపై నేనుంటిని
నా చుట్టు గూడు కట్టి – ఆ ఇంటిలో నేనుంటి
చాల దినములందు వేచియుంటిని – రెక్కలు రాగా నేను ఎగురుచుంటిని /పట/
2.నన్ను పోలి నీవును జీవించుము – దేవుని కొరకె నీవు వేచియుండుము
నా చుట్టు తిరిగి చూడు – ఆయన చిత్తమేదో అడుగు
క్రొత్త జీవమాయన నీకిచ్చును – ఆయన జీవమొందియే జీవింతువు /పట/