మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో శిస్యులై యుండెదరు
1 నీరు కట్టిన తోట వలె నీటి ఊట వాలే నుండేదరు
క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్మును నడిపించును
బలపరచును మీ యెముకలను అధికముగా ఫలించుడి
2 చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు
ఎండియున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు
మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి
3వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింప చేయు తన శాంతిని
ఐశ్వర్యముతో నింపు మిమ్ము-ముదిమి వరకు మిమ్ము మోయువాడు
మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి
4 పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటి వారు
పొగడెదరు ప్రజల్లెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడెదరు.