ప: మా సర్వాధికారి నీవేనయ్యా– నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మమ్ము బలపరచుము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా (2) “మా సర్వాధి “
1.మా స్నేహితుడవు – మా రక్షకుడవు– పరిశుద్దుడవు
మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
2.నీవే మార్గము-నీవే సత్యము-నీవే జీవము మా యేసయ్యా (2)
జీవపుదాత-శ్రీ యేసునాధా
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
3.విరిగితివయ్యా – నలిగితివయ్యా
కలువరిలోన నా యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)