మానసవీణను శృతిచేసి – మనసు నిండ కృతజ్ఞత
నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా
1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
స్తుతి చేయుట క్షేషమకరం – ఘనపరచుట మేలుకరం
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం
2. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి
దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
మనమే జగతికి వెలుగిస్తే – విశ్వాసగళాలు
కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా