మానవ నేత్రాలకు కనిపించనదీ మహఘని
మనో నేత్రానికే కనిపించే ఆ ఘని బైబిలని(2)
బైబిలంటే మత గ్రంథం కాదని..మహ జ్ఞానమిచ్చే
ఘనియని మనస్సు పెట్టి చదివితే దానిని
మహత్ములుగా మిగిలిపోతారని(2) (మాన)
1. మాట వల్ల కలిగింది ప్రపంచం ఆ మాటే
క్రీస్తేసు నిజం నిజం (2)
శరిరాన్ని ధరించి సిలువపైన మరణించి(2)
సమాధినే గెలిచేను యేసు
సజీవుడై లేచెను క్రీస్తు (2) (మాన)
2. లోకంలో ఉన్నదంతా దేవుని జ్ఞానం
దానికై వెతికితే అజ్ఞానం (2)
జ్ఞానానికి మూలం దేవుడని మరచి(2)
వెర్రితలలు వేస్తుందీ లోకం
ఎటో వెళ్ళిపోతుంది ప్రపంచం (2)(మాన)