మహోన్నతుడైన దేవుడు – మహిమరూపుడు
మహిలోని జనులపై తన ప్రేమచూపెను
ప్రియకుమారుడు యేసయ్యను ఈలోకమునకు పంపెను
మానవాళి జీవితాలలో వెలుగు నింపెను
1. ఆదియందే ఉన్న వాక్యం – దేవునియొద్ద ఉన్నవాక్యం
దేవుడై యున్నట్టి వాక్యం – ప్రేమయై యున్నట్టి వాక్యం
మనుష్య రూపమును కృపా సత్యమును
ధరించుకొని నరుల మధ్యను నివసించను జనియించెను
2. బంధకములలో ఉన్నవారికి విడుదలను ప్రకటించుటకును
భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపజేయను
సువర్తమానమును దీనులకందించను
దేవుని అభిషేకమును పొందెను – దైవాత్మతో ఉదాయించెను