మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు…
ప్రేమించెను ప్రాణమిచ్చెను – ఈ స్థితికి నన్ను చేర్చెను…II2II
నా పేద బ్రతుకును మార్చినాడు – నన్నెంతో దీవించెనుII2II
లోకాన దొరకని తన శ్రేష్ట ప్రేమ – నా యెడల కనుపరచినాడుIIమంచిII
1.నా బాధలన్ని తొలగించినాడు – నా భారమే మోసినాడు
నా దుఃఖ దినములు సరిచేసినాడు – సంతోషమే ఇచ్చినాడు
తన కౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు..
నీ తల్లి మరిచినా… నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII
2.నా దీన స్థితిని గమనించినాడు – నా గాదనే మార్చినాడు
నే పడిన స్థితిని గుర్తించినాడు – తన చేతితో లేపినాడు
నా గాయములన్ని కడిగి-నన్నెంతో ప్రేమించినాడు
తన ప్రేమ చాటే ఓ గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII
3.నా పాప శిక్షను భరియించినాడు-నా పక్షమే నిలిచినాడు
నా కొరతలన్ని తను తీర్చినాడు-నా నింద తొలగించినాడు
నీ నడిగిన అన్నివేళలా – నా మనవి మన్నించినాడు
నే వెళ్ళు దారిలో – నా తోడు నడిచి – నన్నెంతో బలపరిచినాడుIIమంచిII