మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు
మరణపు ముల్లును విరిచినవాడవు మహిమ స్వరూపుడా 1
మార్పు నొందని మహానీయుడా 2
సాటెవ్వరు నీకు సరిపోల్చదగునా నీకెవ్వరు 2
జయ్ జయ్ ధ్వనులతో నిన్ను ఆరాధింతును
స్తోత్రబలులతో నిన్ను కీర్తించెదను
సమీపించని తేజస్సునందు వసియించుచున్న రవికోటి తేజోమయా2
అనంత లోకానికారాధ్య దైవమా అదృశ్య మహిమలో అద్యంత రహితుడా
అభిషిక్తుడా అక్షయుడా అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా
1.అల్ఫా ఒమేగవు నీవు ఆదియు అంతము నీవే ప్రభు 2 “జయ్ జయ్“
2.పాపపు ఊబిలో నే పడియుండగా నా దరికి చేరి నను నీలో దాచావయా 2
శాశ్వత శోభాతిశయముగ నను మార్చి బహు తరములకు నిత్యజీవమిచ్చావే
పరిశుద్ధుడా పావనుడా పరిపూర్ణుడా ప్రసన్నుడా1
ప్రేమాస్వరూపివి నీవు కారుణామయుడవు నీవే ప్రభు 2 “జయ్ “
3.పరిపూర్ణ సౌందర్య సీయోనులో నను చేర్చుటయే నీ నిత్య సంకల్పమా 2
సుందర లోకంలో నిను నేను చూచెద సువర్ణ వీధులలో నీతోనే నడిచెద
సర్వేశ్వరా సంపూర్ణుడా శ్రీమంతుడా సాత్వికుడా1
సర్వాధికారివి నీవు సర్వాంతర్యామివి నీవే ప్రభు2 “జయ్ జయ్“