మనిషి జన్మ ఎందుకు?మనిషి బ్రతికేది తనవారికోసం
వేసింది భక్తుని వేషం- చేసేది అంతా మోసం
ఊపిరిచ్చినా దేవుడు ఊరుకోడు ఊరుకోడు
క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు(మనిషి)
1. మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని
ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని(2)
వట్టిమాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు
ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు(2)
ఒకసారి పుట్టాలి దేవునికై బ్రతకాలి ఆపైన మరణించి పరలోకం చేరాలి (మనిషి)
2. ప్రకృతిలో ఏదీ కూడా తనకోసం బ్రతుకుటలేదు
సృష్టిలోని మనిషిని చూడ తన కోశమే బ్రతుకునుచూడు(2)
కూటికొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు
పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు(2)
మనిషి మృగానికి తేడాయే లేకుందీ
ఇటువంటి వారి కోసమే పాతాళం పొంచియుంది(2)(మనిషి)