మనలో ప్రతి ఓక్కరి పేరు-యేసుకు తెలుసు
మనలో ప్రతి ఓక్కరి ఊహలు-యేసుకు తెలుసు (2)
హృదయాంతరంగములో-బాధలు తెలుసు
మన గుండె లోతుల్లో-వేదన తెలుసు
జగత్తు పునాది వేయబడకముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా
1.మనసులోని మాట- నీవు పలుకకముందే
ఎరిగియున్నాడు యేసు ఎరిగియున్నాడు (2)
తల్లి గర్భము నందు నిన్ను రూపించకముందే
ఎరిగియున్నాడు యేసు ఎరిగియున్నాడు (2)
సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
ఆకాశ వీధులలో నీవు విహరించినా
ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా
2.నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు వున్నాడు-ప్రభుయేసు వున్నాడు (2)
నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా యేసు వున్నాడు-ప్రభుయేసు వున్నాడు (2)
నీ యవ్వనకాలమున ప్రభుయేసు ని స్మరియంచి
నీ ఓంటరి సమయంలో కన్నీటితో ప్రార్ధించు
ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభుయేసుని నీ హృదయము లోనికి ఆహ్వానించుమా.