మందిరం ప్రభుని మందిరం సుందరమైనది చూడదగినది
మరపురానిది మరువజాలని పరిశుద్ధమైనది పావనమైనది
1. మనుష్యుల చేత విసర్జింపబడి దేవుని చేత ఏర్పరచబడినది
సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది ఈ మందిరం ||మందిరం||
2. అన్యజనులలో కదలిక కలిగెను కదిలిరి వారు కానుకలతో
అర్పించిరి తమ ఇష్ట వస్తువులు
నింపిరి మహిమతో ఈ మందిరమును ||మందిరం||
3. కష్టపడిరి తన సేవకులంతా నష్టమనక మన దేవుని పనికై
పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ||మందిరం||
4.మునుపటి మందిరము కన్న మించినదై
కడవరి మందిరము మహిమతో నింపబడె
కనబడుచున్నది కాంతివంతముగా
నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||