మధురం ఈ సమయము – హృదయం ఉప్పొంగెను
మన బ్రతుకులో మరో ఏడు గడచిపోయెను
తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను
happy new year- (4)
1. సిరిగలవారెందారో – బలమున్న మరెందరో
మరి కానరాకుండ ధరను విడిచిపోయిరి
కాదు కాదు మన ఘనత – కేవలమిది తనదు కృప
మనలనింక ఊపిరితో మహిలొనుంచెను
2. లెక్కలేమి ఆపదలు – చుట్టుకున్న వేళలలో
చక్కనైన జ్ఞానమిచ్చి చిక్కులన్ని బాపెను
విడువలేదు ఏ క్షణము – మరువలేదు ఏ దినము
దీవెనలెన్నో కృపతో మనకు పంచెను